జగన్ చిత్రపటం పై లిక్కర్ పోసి నిరసన !
1 min read
పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ రెడ్డి చిత్రపటానికి జే బ్రాండ్ లిక్కర్ పోసి టిడిపి శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసన తెలిపారు. కల్తీ సారా, జే బ్రాండ్ లిక్కర్ కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని, అసెంబ్లీ లో చర్చ జరపాలని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాలపై న్యాయ విచారణ కు అంగీకరించే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.