NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5o వ డివిజన్ లో జగనన్న ఆరోగ్య సురక్ష పరీక్షలు

1 min read

తంగెళ్ళపూడి అర్బన్ హెల్త్ సెంటర్ లో దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత పరీక్షలు, మందులు పంపిణీ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  జగనన్న ఆరోగ్య సురక్ష   కార్యక్రమంలో భాగంగా శనివారం 5o డివిజన్ ఎం.ఆర్. సి. కాలనీలో ఇంటింటికి వెళ్లి మెడికల్ సిబ్బంది బిపి, షుగర్,   డెంగు, మలేరియా, తదితర వైరల్ వ్యాధుల పరీక్షలు మరియు కిషోర్ బాల బాలికలకు 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు హిమోగ్లోబిన్ (హెచ్ బి) పరీక్షలు కూడా నిర్వహిసస్తూన్నమని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అక్టోబర్ మూడవ తేదీన తంగెళ్ళమూడి లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు అన్ని రకాల వ్యాధులకు  నిప్పునులైన డాక్టర్లచే పరీక్షలు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ కూడా అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ లు టి మురళీకృష్ణ , ఆర్ సింగరాజు, ఏఎన్ఎం కె నాంచారమ్మ , ఆశ వర్కర్లు టీ కమల కుమారి, ఏ దుర్గ, వాలంటీర్లు కె మరియ కుమారి, ఎన్ వి లక్ష్మి పాల్గొన్నారు.

About Author