PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదవాడి ఆరోగ్యానికి- జగనన్న భరోసా

1 min read

– ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో ఎంపీపీ

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఏదైనా జబ్బు వచ్చినప్పుడు పేదవాడు అప్పుల పాలు కాకూడదు అనే ధ్యేయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, గురువారం వారు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య ఎంపీపీలు  మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యము అనే భావనతో ఎవరు కూడా సరైన వైద్యం అందక మరణించకూడదని భావించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు, దీని ద్వారా  ప్రతి పేదవాడికి ప్రతి   కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు,  గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని  నిర్వీర్యం చేసే విధంగా చంద్ర బాబు నాయుడు ప్రయత్నం చేయగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టగానే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఎన్నో వేల వ్యాదులను అందులో  చేర్చి తండ్రికి తగ్గ తనయునిగా చరిత్రకెక్కాడని వారు తెలియజేశారు, ప్రతి పేదవాడు తనకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉండేందుకు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు 25 లక్షలకు చేసినటువంటి గొప్ప మహోన్నతమైన మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు, అలాగే ఆరోగ్యశ్రీ పథకం యొక్క విశిష్టతను కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వివరించడం జరిగింది, అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు  ఆరోగ్య శ్రీ పథకం యొక్క విధివిధానాలను వాటి ఉపయోగాలను ప్రజలకు వివరించాలని ఏఎన్ఎంలు ఆశ వర్కర్లకు వాలంటరీలకు సూచించడం జరిగింది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులను త్వరగా ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో,ఎంపీడీవో సుబ్రమణ్యం శర్మ , పంచాయతీ సెక్రెటరీ రామసుబ్బారెడ్డి , డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ, సొసైటీప్రెసిడెంట్అల్లిశ్రీరామ్మూర్తి,వాలంటీర్లు ,ఏఎన్ఎం లు ,ఆశ వర్కర్లు , పాల్గొన్నారు.

సెక్రెటరీ, స్పెషల్​ ఆఫీసర్​, టిడిపి,

About Author