PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

1 min read

– ఎల్లార్తి గ్రామంలో గడప గడపకు-మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..

– గ్రామంలో మంత్రి గుమ్మనూరుకి స్వాగతం పలికిన మహిళలు..

– గ్రామంలో ఎల్లార్తి శేక్షావలి,షాషావలి దర్గాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గుమ్మనూరు.

– జలజీవన్ మిషన్ ద్వారా గ్రామంలో టెండర్లు పూర్తి అయిన వెంటనే 56లక్షలుతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాము.

– మరో 10 లక్షలుతో సచివాలయం నిధులు నుంచి 60వేలు లీటర్ల నీటి సంపు ఏర్పాటు చేస్తాము.

– జగనన్న ప్రభుత్వం ఏర్పడిన  నాటి నుండి నేటి వరకు ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు ద్వారా 16కోట్ల 42లక్షలు లబ్ధి పొందారు.

– జగనన్న సురక్ష వల్ల గ్రామంలో 600మందికి లబ్ధిదారులకు మంచి జరిగింది..

– సచివాలయం నిధులతో గ్రామం లో రూ 10లక్షల వ్యాయoతో  మౌలిక వసతులు ఏర్పాటు చేయండి.

– గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న కందరమ్మగుడి నిర్మాణంలో గుడికి 50వేలు రూపాయలు విరాళం ప్రకటించిన మంత్రి గుమ్మనూరు

– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: జగనన్న ప్రభుత్వం ఏర్పడిన  నాటి నుండి నేటి వరకు ఆలూరు నియోజకవర్గానికి రూ. 1050 కోట్లు సంక్షేమ ఫలాలు అందాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.గురువారం హోళ గుంద మండలం ఎల్లార్తి ఎగ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రివర్యులకి నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు తప్పెట్లు, శాలువా, బాణసంచా పూలమాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రివర్యులు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటిస్తూ…రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో దృఢ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు, చెందుతున్నాయో, ఏమాత్రం చెందుతున్న అన్న అంశంపై మంత్రి  ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ సంక్షేమ పథకాలైన నవరత్నాలు తదితర అంశాలు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరించుకుంటూ అభివృద్ధి దృష్టిలో పయనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం అనేక రకాలైన హామీలను నెరవేరుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.ఎల్లార్తి గ్రామంలో  సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ. 16 కోట్ల 42 లక్షలు అర్హులైన వారకి లబ్ధి చేకూరిందన్నారు. గ్రామ సచివాలయం నిధులతో రూ 10 లక్షలుతో సచివాలయం నిధులు నుంచి 60వేల లీటర్ల నీటి సంపు ఏర్పాటు చేయాలని మరియు  గ్రామంలో రూ. 10 లక్షల మౌలిక సదుపాయాల కొరకు డ్రైనేజీ, రోడ్లు, పనులు కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. త్రాగునీటి కోసం జలజీవన్ మిషన్ ద్వారా రూ. 56 లక్షల తో త్వరలో గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కులాయి ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడి సమస్యను నివారిస్తామన్నారు.గ్రామంలో ఎల్లార్తి శేక్షావలి,షాషావలి దర్గాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి గుమ్మనూరు. హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామం నందు వెలసిన హజరత్ షేక్షావలి, హజరత్ షాషావలి దర్గాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం  దర్గాను సందర్శించి ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు నాయకులు ఆయనను శాలువా, పూలమా లలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం  దర్గాల పెద్దలు చిత్రపటాలను బహుకరించారు.అనంతరం మంత్రివర్యులు సచివాలయం అధికారులకు ప్రాధాన్య  భవనాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు,గ్రామ సర్పంచ్ కె.చామండేశ్వరి,ఎంపీపీ తనయుడు ఈషా,మండల కన్వీనర్ షఫీ,జడ్పీటీసీ బావ శేషాప్ప,గ్రామ నాయకులు మల్లికార్జున,యస్.కె.గిరి,దర్గాప్ప, లక్ష్మీకాంత్,మాజీ జడ్పీటీసీ రాంభీం నాయుడు,పలువురు ఎంపీటీసీ సభ్యులు,నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author