PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట..

1 min read

– అన్నమయ్య జిల్లాముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  మసీదులను సందర్శించి వాటి స్థితిగతులను తెలుసుకొని  మౌజం, ఇమామ్ లకు  వేతనాలు అందుతున్నాయో లేదో వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ జకియ ఖానం తో పాటు మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహ్మాన్ అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ లను కోరారు రీజినల్ చైర్మెన్ ఫక్రుద్దీన్ షరీఫ్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ నూర్ భాషా..హర్‌ దిల్‌ మే వైఎస్‌ఆర్‌..హమ్‌ సబ్‌ జగన్‌కే సాథ్‌’ ప్రచార కార్యక్రమం లో బాగంగ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో లో  శనివారం పర్యటించారు .అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు ఇతర మైనార్టీ నేతలతో పాటు మసీద్ కమిటీ సభ్యులతో కలిసి మస్జిద్ ఈ ఉమర్ మసీద్ ను వారు సందర్శించారు.మసీద్ స్థితి గతులతో పాటు ఇతర సమస్యల పై అరాతియడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముస్లిం మైనార్టీలకు రాజకీయ రంగమ తో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి అయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు.అన్నమయ్య జిల్లా మౌజాం, ఇమామ్ ల స్థితిగతుల పరిశీలకుడిగా బేపారి మహమ్మద్ ఖాన్ ఎంపిక చేస్తున్నట్లు వారు తెలియజేశారు.ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మానవతా హృదయంతో ఎన్నికల అప్పుడు ఏదైతే మాట చెప్పారో దాని ప్రకారం అమలుపరుస్తూ ప్రతి కుటుంబానికి మంచి చేస్తున్నారన్నారు.గత 4 సంవత్సరాలుగా  ఎప్పుడు గాని  రాజకీయాల కోసమో ఓట్ల కోసమో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. అయితే 98 శాతం మందికి మేలు చేసి కొన్ని సాంకేతిక కారణాలవల్ల రెండు శాతం మందికి లబ్ధి చేకూరకుంటే ఆ రెండు శాతం వాటినే ప్రతిపక్ష పార్టీలు విష ప్రచారానికి తెర లేపుతున్నారని  మనం చేసిన మంచిని చెప్పుకోవడానికి ప్రతి వర్గానికి  మనం చేసిన మంచిని ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ ఉన్నతి కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రధానంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన మహానుభావుడని ఆ రిజర్వేషన్ల వల్ల నేడు ఎందరో ముస్లిం యువత ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు.ఆదే విధంగా ఐదేళ్ల టీడీపీ పాలనలో ముస్లిం మైనారిటీలకు రూ.2665 కోట్లు కేటాయిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలోనే రూ. 11896 కోట్లు కేటాయించారని ముస్లింలకు మనం చేసిన మంచిని  చెప్పాల్సిన అవసరం మీపైనే ఉందన్నారు. అదేవిధంగా కార్పొరేటర్ స్థాయి నుండి డిప్యూటీ సీఎం వరకు ముస్లింలకు గుర్తింపును ఇస్తున్న ఘనతను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సాధించారని గుర్తు చేశారు. ముస్లింలకు అన్ని విధాల వైసిపి మేలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ ముస్లింల వ్యతిరేక పార్టీ అయినా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.అందులో భాగంగానే ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం కూడా చంద్రబాబు నాయుడు అయ్యారన్నారు. గతంలో కూడా నాలుగేళ్ల పాటు బిజెపితో కలిసి టిడిపి అధికారం పంచుకున్న తీరును గుర్తు చేశారు.లౌకిక వాదానికి కట్టుబడి ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పాలనతో పాటు నాలుగేళ్ల పాలనలో అన్నమయ్య జిల్లలో  జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించారు.ముస్లింల సంక్షేమం, సాధికారత కోసం నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. నేడు వైఎస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను  క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని వారు  సూచించారు.

About Author