సామూహిక వివాహాలకు జై భీమ్ టీవీ బరిగెల శివకు ఆహ్వానం
1 min read
హొలగుంద , న్యూస్ నేడు : ఏప్రిల్ నెల 14వ తేదీన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున హొళగుంద లో నిర్వహిస్తున్న సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొని కొత్తజంటలకు శుభాకాంక్షలు తెలియజేయాలని జై భీమ్ టీవీ ఫౌండర్ ఎడిటర్ సీఈవో బరిగెల శివ ను సామూహిక వివాహాల కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్ నగరం తార్నాకలోని జై భీమ్ టీవీ కార్యాలయంలో బరిగెల శివ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశలతో అందరికీ న్యాయం పేరుతో స్టగల్ ఫర్ జస్టిస్ అంటూ జైభీమ్ టివి ఆధ్వర్యంలో పేద సామాన్య అన్నగారిన వర్గాలతో పాటు అందరికీ న్యాయం కోసం కృషి చేస్తున్న జై భీమ్ టీవీ మరియు జై భీమ్ దిన పత్రిక ఫౌండర్ అండ్ ఎడిటర్ గా కృషి చేస్తున్న బరిగెల శివ కార్యక్రమంలో పాల్గొని వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలతో పేద సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులు బాటును కలిగించేలా నిర్వహిస్తున్న సామూహిక వివాహ కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు న్యాయం న్యూస్ రిపోర్టర్ పంచకుండగ వెంకటేష్, ప్రతినిత్యం దినపత్రిక విలేఖరి కన్నారావు, భహుజన టైమ్స్ ఎండి దుర్గాప్రసాద్ అలేఖ్య విజయ్ కుమార్ మార్లమడికి రంగప్ప, మార్లమడికి రమేష్ కురవాలి ఉదయ్ కుమార్ దేశ పోరాటం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
