NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జన విజ్ఞాన వేదిక -వక్త 2026  పోటీలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల నందు జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో వక్త అనే అంశం పైన  పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన విజ్ఞానిక వేదిక నుంచి సభ్యులు హాజరై విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించి జిల్లాస్థాయికి ఎంపిక చేసుకోవడం జరిగిందని  కళాశాల ప్రిన్సిపల్ మద్దిలేటి  తెలియజేశారు. ఈ పోటీలో విద్యార్థులు  ఉదయ్ మొదటి బహుమతి,  ప్రియాంక ద్వితీయ బహుమతి, ఇందువర్ధన్ తృతీయ బహుమతి సాధించి జిల్లాస్థాయి ప్రభుత్వ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. బహుమతులు సాధించిన విద్యార్థులకు జన విజ్ఞాన  వేదిక సభ్యులు బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ మద్దిలేటి  తెలుగు అధ్యాపకులు మద్దయ్య, హిమబిందు, గణిత అధ్యాపకులు  మాధవి, ఆంగ్ల అధ్యాపకురాలు సుమ, మరియు విద్యార్థులు అభినందించడం జరిగింది.

About Author