NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్యాన్సర్ పై  పొదుపు మహిళలకు అవగాహన

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు:  స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి APVHA  సహకారం తో” వరల్డ్ క్యాన్సర్ డే” SHG లీడర్స్ కు మరియు పొదుపు మహిళలకు క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.రకరకాల క్యాన్సర్లు(నోటి క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్, గర్భాశయం క్యాన్సర్) రావడానిక గల కారణాలు మరియు నివారణ గురించి సభ్యులకి వివరించడం జరిగింది.ప్రపంచవ్యాప్తంగా 70%పైగా క్యాన్సర్లు అదుపులోకి వస్తున్నాయి. క్యాన్సర్ రోగులు మునుపటి కంటే దీర్ఘకాలం జీవించగలుగుతున్నారు.వ్యాధి నివారణ చర్యలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావడం ఇందుకు ప్రధానకారణం టార్గెటెడ్ థెరపీ ద్వారా వ్యాధిని అదుపులోకి తెచ్చి ఆయుర్దాయం పెంచుటకు మనదేశం లో ప్రతియేటా 10లక్షల47వేల మందికి క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని నిపుణులు సూచించారు.ఈ వ్యాధి పట్ల అవగాహన పెరిగి తొలినాళ్లలోనే ఈ వ్యాధిని కనిపెట్టడం వలన క్యాన్సర్ రోగుల సంఖ్య తగ్గుతుంది.వ్యాధిని అడ్డుకట్ట చేయడం ద్వారానే దాని విజయం సాధించగలుతాం.అందుకోసం క్యాన్సర్ పట్ల అవగాహన మరింత పెరగాలని  CRP సునీత  వివరించడం జరిగింది.

About Author