బద్వేల్ ఉప ఎన్నికకు జనసేన దూరం..టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ!
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అయితే దివంగత వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధాను గౌరవిస్తూ ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు జనసేన అధినేత పవన్కళ్యాణ్ శనివారం ప్రకటించారు. జనసేన, బీజేపీ మధ్య జరిగిన చర్చల్లో జనసేనకు పోటీచేసే అవకాశం ఇచ్చారు. అయితే జనసేన పోటీకి దూరమని వెల్లడించింది. దీంతో బద్వేల్ బరిలో టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్, వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా మధ్యే పోటీ అనివార్యమయింది. నామినేషన్ దాఖలుకు అక్టోబరు 8, నామినేషన్ల ఉపసంహరణకు 13 తేదీలను ఖరారు చేశారు. అక్టోబరు 30 ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో ఇరుపార్టీలు ప్రచారం దృష్టి సారించాయి. కాగా నవంబర్ 2న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.