సిబ్బందికి ఒంగి నమస్కారం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ : మున్సిపల్ అధికారులు, సిబ్బంది తీరుపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సమీక్ష సమావేశానికి మున్సిపల్ సిబ్బంది గైర్హాజరు కావడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు సమావేశానికి హాజరుకావాలని .. శనివారమే మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే.. సోమవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కరోన మూడో దశ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అధికారులు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం వస్తారని జేసీ ప్రభాకరరెడ్డి ఎదురు చూశారు. అయినా కూడ మున్సిపల్ సిబ్బంది రాకుండా అటు నుంచి అటే వెళ్లిపోవడంతో ప్రభాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో వచ్చిన కొందరి సిబ్బంది నిబద్దతకు మెచ్చుకుంటున్నట్టు ‘ ఒంగి నమస్కారం` ’ చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది వచ్చే వరకు మున్సిపల్ ఆఫీసులోనే కూర్చుంటానంటూ భీష్మించుకు కూర్చున్నారు.