శిశువుల చర్మ సంరక్షణ బాధ్యత.. జాన్సన్స్ బేబీది..
1 min read
కెన్‌వ్యూ బిజినెస్ యూనిట్ హెడ్ – ఎసెన్షియల్ హెల్త్ & స్కిన్ హెల్త్ & మార్కెటింగ్ వీపీ మనోజ్ గాడ్గిల్
- ‘ ONEder Labs ’ తో… జాన్సన్స్ సంస్థ 2వేల మంది మాతృమూర్తులకు పూర్తి అవగాహన
– కాజల్ అగర్వాల్, మిలానా నాగరాజ్, గాయత్రి యువరాజ్, రితికా తమిళ్‌సెల్వి, శ్రీదేవి అశోక్ తదితర సెలెబ్రిటీ మాతృమూర్తులు తమ పేరెంటింగ్ వివరాలు వెల్లడి
విజయవాడ, న్యూస్ నేడు: అగ్రగామి బేబీ కేర్ బ్రాండ్ అయిన జాన్సన్స్ బేబీ, ONEder Labs పేరిట మెగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఇంటరాక్టివ్, అనుభవపూర్వక కార్యక్రమంలో 2,000 మంది పైగా మాతృమూర్తులు (ఇన్-పర్సన్, వర్చువల్‌గా), నిపుణులు, దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. శిశువుల చర్మానికి సంబంధించిన శాస్త్రీయత, అలాగే మొదటి రోజు నుంచే శిశువుల చర్మ సంరక్షణలో సహాయపడే జాన్సన్స్ బేబీస్ వినూత్న ఫార్ములేషన్స్ గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాతృమూర్తులు పాల్గొన్నారు. జాన్సన్స్ బేబీస్ ఫార్ములాలకు మూలస్తంభాలైన దశాబ్దాల సైన్స్ మరియు పరిశోధనల గురించి తెలుసుకున్నారు. అలాగే జాన్సన్ బేబీ ప్రోడక్టుల తయారీ గురించి, అత్యంత జాగ్రత్తగా ఎంపిక చేసే ముడిపదార్థాల గురించి అర్థం చేసుకున్నారు. వివిధ జాన్సన్స్ బేబీ ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకున్నారు. వీటిలో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉండవు. అన్ని ఉత్పత్తులు డెర్మటాలజిస్టులచే పరీక్షించబడినవై ఉంటాయి. ఫార్ములేషన్లలోని 96% ముడిపదార్థాలు సహజసిద్ధమైనవి ఉంటాయి.
ONEder Labs కార్యక్రమంలో శిశు చర్మానికి సంబంధించిన శాస్త్రీయతపై 15 ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ ప్రయోగాలు నిర్వహించబడ్డాయి. శిశువుల యొక్క విభిన్నమైన చర్మ సంరక్షణలో నిరంతరాయంగా ప్రమాణాలను నెలకొల్పుతున్న జాన్సన్స్ అత్యుత్తమ ఉత్పత్తుల శ్రేణి వెనుక శాస్త్రీయత గురించి వివరించబడింది. శిశువు కళ్లకు ఇబ్బంది కలగకుండా సంరక్షించే అధునాతన సాంకేతికత అయిన No More Tears® ఫార్ములా, అలాగే ఒకవైపు శిశువు చర్మపు సహజసిద్ధమైన pH మరియు తేమను కాపాడుతూనే, మరోవైపు చర్మంలోకి చొచ్చుకుపోకుండా సమర్ధవంతంగా శుభ్రపర్చే పెద్ద మిసెల్స్‌తో (micelles) కూడుకున్న, విశిష్టమైన JIM* ఆధారిత pH బ్యాలెన్స్‌డ్ క్లీన్సర్స్ మొదలైన ఆవిష్కరణలు వీటిలో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు కూడా పాల్గొన్నారు. కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ & నియోనేటాలజిస్ట్ Dr. సగుల్ రామానుజ ముగునాథన్ (Sagul Ramanuja Mugunthan), MBBS, MD (Paes), IDPCCM, PGPN (Boston) మరియు బసవేశ్వర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండీ Dr. శాలిని (MBBS MD) లాంటి ఇన్-హౌస్ మరియు బైటి నిపుణులను మాతృమూర్తులు సంప్రదించేందుకు ఇందులో అవకాశం లభించింది. మొదటి రోజు నుంచి శిశువు చర్మాన్ని సంరక్షించేందుకు పాటించాల్సిన ఉత్తమ విధానాలను నిపుణులు తెలియజేశారు. శిశువుల చర్మ సంరక్షణపై సాధారణంగా నెలకొన్న అపోహలను నివృత్తి చేశారు. అలాగే ఇండియన్ అకాడెమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) నిర్దేశించిన చర్మసంరక్షణ మార్గదర్శకాలను వివరించారు.
జాన్సన్స్ బేబీ వెనుక శాస్త్రీయతను గురించి మాట్లాడుతూ, “జాన్సన్స్ బేబీ చేసే ప్రతి పని వెనుక వినూత్నత ఉంటుంది. శాస్త్రీయత దన్నుగల సురక్షితమైన ఉత్పత్తులను సృష్టించాలనేది మా లక్ష్యం. జాన్సన్స్ బేబీకి చెందిన ప్రతి ఉత్పత్తిలోనూ ఈ లక్ష్యం ప్రతిఫలిస్తుంది. దశాబ్దాల పరిశోధనలు, శాస్త్రీయత దన్నుతో తొలి రోజు నుంచి శిశువు చర్మ సంరక్షణలో తోడ్పడతామన్న హామీని మా ఉత్పత్తులు ప్రతిఫలిస్తాయి. విస్తృతమైన మా శాస్త్రీయత విశేషాలు, మా ఉత్పత్తుల గురించి, వాటిలో ఉపయోగించిన ముడిపదార్థాలు, వాటి ఫార్ములేషన్స్ గురించి, తరతరాలుగా పేరెంట్స్/తల్లులకు విశ్వసనీయమైన ఎంపికగా జాన్సన్స్ బేబీ నిలుస్తుండటం వెనుక కారణాల గురించి మాతృమూర్తులు సవివరంగా తెలుసుకునేందుకు మా విశిష్టమైన ONEder Labs నిర్వహించాం” అని కెన్‌వ్యూ బిజినెస్ యూనిట్ హెడ్ – ఎసెన్షియల్ హెల్త్ & స్కిన్ హెల్త్ & మార్కెటింగ్ వీపీ మనోజ్ గాడ్గిల్ తెలిపారు.
“ప్రతి పేరెంట్ పట్ల మేము చూపే నిబద్ధతకు నిదర్శనంగా, జాన్సన్స్ బేబీ సృష్టించే ప్రతి ప్రోడక్టుకు కఠోర పరిశోధన, శాస్త్రీయత పునాదులుగా ఉంటాయి. శిశువుల చర్మసంరక్షణలో అగ్రగామి సంస్థగా ఏళ్ల తరబడి శిశు చర్మ శాస్త్రీయతపై నిర్వహించిన విస్తృతమైన పరిశోధనలు మాకెంతో గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా శిశు సంరక్షణకు సంబంధించి మేము కనుగొన్న విషయాలు, కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా శిశు చర్మ సంరక్షణ శాస్త్రీయతలో పురోగమించేందుకు, శిశువుల సున్నితమైన చర్మం గురించి మరింత లోతుగా తెలుసుకునేందుకు మాకు సాధికారత కల్పిస్తాయి. చర్చాగోష్టులు, ప్రదర్శనల ద్వారా మాతృమూర్తులు ఈ శాస్త్రీయతను అర్థం చేసుకునేందుకు, తమ శిశువుల గురించి సరైన ఎంపికలు చేసుకోవడంలో తోడ్పడేందుకు జాన్సన్ ONEder Labs నిర్వహించింది” అని కెన్‌వ్యూ (Kenvue) ఆర్ & డీ డైరెక్టర్ (రీజనల్ హెడ్-బేబీ & ఉమెన్స్ హెల్త్) Dr. దిలీప్ త్రిపాఠి తెలిపారు.
