వేదాస్ షెల్టర్ హోం ను సందర్శించిన న్యాయమూర్తి
1 min readఅనాధ పిల్లలను పరిశీలించి వారికి తగిన పునరావాసం కల్పించిన కర్నూలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం కర్నూలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం, శిశుగృహమ్, వేదాస్ షెల్టర్ హోం, కర్నూలు ను సందర్శించారు, అక్కడి సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు.DLSA., కర్నూలు సిబ్బందికి whatsapp ద్వారా ఒక సందేశం వచ్చింది. ఆ సందేశమును గౌరవనీయ న్యాయమూర్తి దృష్టికి తీసుకొనిరావడం జరిగింది. తక్షణమే న్యాయమూర్తి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు స్పందించి ఆ విషయాన్ని జిల్లా సాధికారత అధికారిణి శ్రీమతి పి. వెంకటలక్ష్మమ్మ మరియు పిల్లల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్, శ్రీమతి జూబేదాబేగం, కర్నూలుకు తెలియజేసారు. వెంటనే సదరు అధికారులు ఆలూరు తాలూకా హాలహార్వి మండలం, బాపురం గ్రామంలో ఉంటున్న పిల్లల విషయాలు సేకరించి ఈ రోజు అనగా 06-10-2023 న ఆ పిల్లలను ఆలూరు నుంచి చైల్డ్ హెల్ప్ లైన్ 1098, CDPO శాఖ వాళ్ళు కర్నూలుకు తీసుకొనివచ్చారు. ఆ అనాధ పిల్లలను న్యాయమూర్తి పరిశీలించి వారిని తగిన విద్య సంస్థలతో సంప్రదించి తగిన పునరావాసం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు, జిల్లా సాధికారత అధికారిణి శ్రీమతి పి. వెంకటలక్ష్మమ్మ, పిల్లల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్, శ్రీమతి జూబేదాబేగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.