NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పై తీర్పు నేడే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బెయిల్ ర‌ద్దు పై బుధ‌వారం తీర్పు వెలువ‌డ‌నుంది. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై వాద‌న‌లు ఇటీవ‌ల పూర్తయ్యాయి. దీంతో నాంప‌ల్లి సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువ‌రించ‌నుంది. పిటిష‌న‌ర్ రిజాయిండర్లు, జ‌గ‌న్ కౌంట‌ర్లతో వాదోప‌వాదాలు కొన‌సాగాయి. జ‌గ‌న్, విజ‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పై ఇవాళ తీర్పు వెలువడ‌నున్న నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాలు, వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఇది ఇలా ఉండ‌గా.. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ ను మ‌రో కోర్టుకు మార్చాల‌న్న ర‌ఘురామ‌కృష్ణ రాజు పిటిష‌న్ పై కూడ ఇవాళ తీర్పు వెలువ‌డ‌నుంది.

About Author