PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జపనీస్ లో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ జపాన్ లో విడుదలైంది. ఈ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం జపాన్ లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఓ ప్రమోషన్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అభిమానులను అలరించారు. “మిమ్మల్ని చూడగానే జపాన్ భాషలో మాట్లాడాలని అనిపించింది. ఏవైనా తప్పులుంటే మన్నించండి. జపాన్ లో పర్యటించడం నాకు ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సహృదయులైన ప్రజల ముంగిట నేను నిల్చుని ఉన్నాను. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను” అంటూ తన మనోభావాలను వెల్లడించారు.

About Author