మంచి ప్రజా నేతను కోల్పోయిన కమలాపురం
1 min read
గౌస్ పీర్ మృతికి సంతాపం ప్రకటించిన సాయినాథ్ శర్మ
కర్నూలు , న్యూస్ నేడు: కమలాపురం మండలం లో ప్రజా స్నేహితుడు తన అనుకున్న వారి కోసం ఎంతవరకైనా వెళ్లగలిగే నాయకుడు ఆప్తుడు ఆత్మీయుడు అయిన మాజీ సర్పంచ్ గౌస్ పీర్ ఆకస్మిక మృతి చెందడం చాలా విచారకరం బాధాకరమని తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గౌస్ పేరు భౌతిక దేహానికి శనివారం సాయంత్రం పూలమాలవేసి సాయినాథ్ శర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపురం పట్టణంలో మైనార్టీ నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గౌస్ పీర్ అందరివాడుగా మండల ప్రజల మన్ననలు అందుకున్నారన్నారు. చిన్న పిల్లవాడిని సైతం పలకరించే మనస్తత్వం ఉన్న గౌస్ పీర్ వ్యక్తిత్వం రాజకీయంగా ఎదుగుతున్న ఎంతోమందికి మార్గదర్శనీయమని అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గౌస్ పీర్ ఆకస్మిక మృతి చెందినప్పటికీ కమలాపురం ప్రజల హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడన్నారు. ఆయన కుమారుడు ఇర్ఫాన్ భాష తండ్రిలాగే మంచి పేరు సంపాదించుకుంటున్నారని తన తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా ప్రజాసేవలో ఉండాలన్నారు. ఈ మేరకు గౌస్ పీర్ కుమారుడు ఇర్ఫాన్ భాషను కలిసి మనోధైర్యంగా ఉండాలని కోరారు.