కమలాపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్.. డైరెక్టర్ ల నియామకం
1 min read

కమలాపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా చెన్నూరు కు చెందిన ఆకుల చలపతి. డైరెక్టర్ గా కొండాల చెన్నయ్య
న్యూస్ నేడు చెన్నూరు: కమలాపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. గా .ఆకుల చలపతి. మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కొండాల చెన్నయ్య లు ను నియమిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి. కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు కి చెందిన ఆకుల చలపతి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగాను యువనేతగాను మండల నాయకుడు గాను తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశారు. అలాగే చెన్నూరు కొత్త గాంధీ నగర్ కు చెందిన కొండాల చెన్నయ్య ఆది నుంచి పార్టీకి కట్టుబడి పనిచేస్తూ వచ్చారు. ఈనెల 28వ తేదీన కమలాపురంలోని అమరావతి కళ్యాణమండపంలో మధ్యాహ్నం 3. 45 గంటలకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి తో పాటు వైస్ చైర్మన్ ఆకుల చలపతి డైరెక్టర్ కొండాల చెన్నయ్య మరి కొంతమంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. పుత్త నరసింహారెడ్డి. కమలాపురం శాసనసభ్యులు పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరవుతున్నారు.

