‘ కన్నప్ప’ సినిమాను బహిష్కరించండి
1 min read
ఏపీ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు యన్. వెంకటరామరాజు
కర్నూలు, న్యూస్ నేడు :సనాతన ధర్మం, హిందూ మత విశ్వాసాలను… బ్రాహ్మణ జాతి సాంప్రదాయాన్ని.. సంస్కృతులను.. ఆచారాలను కించ పరుస్తూ.. అవహేళన చేస్తూ చిత్రించిన సినిమా కన్నప్ప ను దేశ ప్రజలు బహిష్కరించాలని ఏపీ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు యన్. వెంకటరామరాజు పిలుపునిచ్చారు. గతంలో ‘ దేనికైనా రెడీ ’ అనే సినిమాలో కూడా బ్రాహ్మణ స్త్రీలను, జాతిని అవమానించారని గుర్తు చేశారు. విదేశీ క్రిస్టియన్ నిధులతో నిర్మించిన “కన్నప్ప” సినిమాలో బ్రాహ్మణులను అవమానించేలా పిలక – గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని కించ పరిచేలా ఉందని, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించరాదని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెంకటరామరాజు కోరారు.