ఏలూరు దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా కాంతి ప్రియ పదవి భాద్యతలు..
1 min read
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: మర్యాదపూర్వకంగా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎం జె వి భాస్కర రావుని కలసి పుష్పగుచ్చం అందించారు ఏలూరు దిశా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కాంతిప్రియ సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భముగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎం జె వి భాస్కరరావుని తన చాంబర్లో మర్యాదపూర్వ కలిసి పుష్పకృతికి అందించారు. ఆయన మాట్లాడుతూ దిశా చట్టమును అమలు చేస్తూ దిశ యాప్ ను గురించి మహిళలకు విద్యార్థిని లకు అవగాహన కల్పిస్తూ మహిళా చట్టాలను గురించి యువతలో అవగాహన కల్పించాలన్నారు.బాధిత మహిళలకు భరోసాను కల్పిస్తూ మహిళలకు అండగా ఉండాలని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా జరుగుతున్న అనర్ధాలను గురించి ప్రచారాలను నిర్వహించాలని సూచించారు.దిశా యాప్ ను గురించి కాలేజీ లలో, హైస్కూల్ లలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కాంతి ప్రియ కు తగిన సూచనలు సలహాలు అందించారు.