NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండలంలో నేటి నుంచి కార్తిక మాస ఉత్సవాలు 

1 min read

-ముస్తాబైన శివాలయాలు

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : మండలంలో వివిధ గ్రామాల్లో నెలకొని ఉన్న ప్రధాన శివాలయాల్లో మంగళవారం నుంచి కార్తీక మాస ఉత్సవాలు ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. చెన్నూరు చెన్నూరు పెన్నా నది బొడ్డున వెలసిన మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈనెల ఈనెల 14వ తేదీ నుంచి వచ్చేనెల 12వ 12వ తేదీ వరకు కార్తిక మాస ఉత్సవాలు నిర్వహించడానికి కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తెల్లవారుజామున 5:00 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నాలుగు వారాలు పాటు ప్రతి సోమవారం ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివపార్వతుల కల్యాణోత్సవాలు గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. చెన్నూరు బస్టాండ్ సమీపంలో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. మండలంలోని శివాల్ పల్లి గ్రామ సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ఉత్సవాలకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అలాగే ఉప్పరపల్లి. రామనపల్లి. కొండపేట. బలిసింగాయపల్లి గ్రామ పరిధిలో ఉన్న కైలాసగిరి సిద్ద లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయాల ఎదుట సల్వ పందిర్లు ఏర్పాటు చేశారు.

About Author