NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ పోటీల్లో” కేఎంసి అథ్లెటిక్స్ ప్రతిభ..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: “ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ పోటీల్లో” కేఎంసి అథ్లెటిక్స్ ప్రతిభ.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆద్వర్యం లో  కాకినాడ మెడికల్ కాలేజీ యందు ఈనెల 5,6 తేదీల్లో నిర్వహించిన ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ పోటీల్లో కర్నూల్ మెడికల్ కాలేజీ విద్యార్థులు జావలిన్ త్రో (ప్రేమ్ రాజ్),డిస్క్ త్రో(ప్రేమ్ రాజ్)లలో స్టేట్ సెకండ్ ప్రైజ్, షాట్ పుట్ లో(ప్రేమ్ రాజ్) థర్డ్ ప్రైజ్,5km రన్నింగ్ లో ( లక్ష్మీ నరసింహ) 3 వ స్థానం సాధించడం జరిగింది. మెడికల్ కాలేజీ విద్యార్థులు చదువులతో పాటు ఆటల పోటీల్లో కూడా చక్కటి ప్రతిబ కనపరచడం పట్ల గెలుపొందిన విద్యార్థులకు మరియు స్పోర్ట్స్ కమిటీ సభ్యులకు, ఫిజికల్ డైరెక్టర్ లకు కాలేజీ ప్రిన్సిపల్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కమిటీ వైస్ చైర్మన్ డా. విద్యాసాగర్, సబ్యులు డా. శంకర్,డా. ప్రవీణ, లెక్చరర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author