NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి

1 min read

ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరం

పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్

కర్నూలు , న్యూస్​ నేడు  : ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని , ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త అవసరమని మంత్రి టి జి భరత్ హెచ్ పి వి టీకా ప్రారంభ కార్యక్రమంలో తెలియజేశారు.మంగళవారం ఉదయం ఏ- క్యాంప్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నివారణ కు ఏర్పాటు చేసిన హెచ్ పి వి ( హుమెన్ పాపిలోమ వైరస్ ) టీకా ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశంలో పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ పాల్గొని ప్రభుత్వం ఇస్తున్న అన్ని వైద్య సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్త చాలా అవసరమని తెలిపారు.14 సంవత్సరాల వయస్సు మొదలు అయ్యి 15 సంవత్సరాల లోపల వయసు గల అమ్మాయిలకు మాత్రమే నాలుగు వేల రూపాయల ఖరీదు చేసే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నివారించే ఈ టీకాను  ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని దీని గురించి అందరికీ తెలియజేయాలని సమావేశంలో పాల్గొన్న వారిని కోరారు.అలాగే ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను నివారించడానికి అన్ని వైద్య పరీక్షలు జరిగిన తర్వాత తీసుకుని వచ్చిన ఈ టీకాను అమ్మాయిలు సరియైన వయసులో తీసుకోవలసిన అవసరం ఉన్నదని కావున తప్పక తీసుకొని తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరారు.ఈ సమావేశానికి జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఉమ , ఆసుపత్రి సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

About Author