కృష్ణానగర్.. ఫ్లైఓవర్ పనులు ప్రారంభం
1 min read
ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న డీఎస్పీ మహబూబ్బాష
ఐటీసీ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
– ట్రాఫిక్ డీఎస్పీ డి. మహబూబ్ బాష
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: నగరంలోని కృష్ణానగర్ ఐటీసీ హైవే వద్ద ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతున్నందున కొన్ని రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, ప్రజలు సహకరించాలని డీఎస్పీ మహబూబ్బాష తెలిపారు. ప్రజల సంక్షేమార్థం చేపట్టే పనుల కారణంగా ట్రాఫిక్ అందరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ RI ఆనందరెడ్డి, RSI రమేష్ బాబు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
దారి మళ్లింపు… ఇలా..
- క్రిష్ణానగర్ లోని వివిధ కాలనీ లనుండి ట్రాఫిక్ ITC కూడలి మీదుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు గుత్తి పెట్రోల్ బంకు వైపు దారి మళ్లించామన్నారు.
- గుత్తి పెట్రోలు బంక్ ప్లైఓవర్ నుండి వచ్చు వాహనాలు హైవే పై నుండి సర్వీస్ రోడ్డు మీదుగా చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న రావూరి ఫంక్షన్ హాల్ వద్ద తిరిగి హైవే పై నుండి ప్రయాణించవచ్చు.
- షరీఫ్ నగర్ కాలనీ వాసులు క్రిష్ణానగర్ లోకి వెళ్ళాలి అంటే చెన్నమ్మ సర్కిల్ వద్ద నుండి తిరిగి రావాల్సి ఉంటుంది.
- గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ నుండి వచ్చే వాహనాలన్నీ షరీఫ్ నగర్ సర్వీస్ రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారణంగా సర్వీస్ రోడ్డు పై ఎటువంటి అవాంతరాలు కలిగించిన,ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- ప్లైఓవర్ నిర్మాణం పూర్తి అగునంతవరకు సర్వీస్ రోడ్డు నందు ఎటువంటి తోపుడు బండ్లు,స్టాల్స్, అనుమతించబడవు.
- ఎట్టి పరిస్థితుల్లో చుట్టూ ఉన్న కాలనీ వాసులు రాంగ్ రూట్స్ లల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురి కావొద్దు.
- ప్రజాప్రయోజనం దృష్ట్యా నిర్మిస్తున్నందున ప్రజలందరూ సహకరించాలని కోరడమైనది.
- ఇంకా ఏవైనా ట్రాఫిక్ మల్లింపులు ఉంటే ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలియచేస్తామని చెప్పడం జరిగింది.