NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలంలో  కూచిపూడి నృత్య ప్రదర్శన

1 min read

శ్రీశైలం, న్యూస్ ​నేడు  : దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (10.01.2026) వసుధకుందుర్తి నృత్యాల డాన్సు అకాడమీ, హైదరాబాద్ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి  ఈ  కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం  నిర్వహించబడుతున్నది.ఈ కార్యక్రమములో గణపతి తాళం, శివాష్టకం, ఓం నమశ్శివాయ, అయిగిరినందిని తదితర గీతాలకు షణ్ముఖశ్రీ, ధాత్రి తదితరులు  నృత్యప్రదర్శన చేయనున్నారు.రెండవ కార్యక్రమములో భాగంగా  శ్రీ వైష్ణవి నాట్యశాల ట్రస్ట్, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.        కాగా   ఈ నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడుతున్నాయిశ్రీస్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *