NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

24 నెలల డి ఎ పాత బకాయిలు విడుదల చేయండి

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  మహానంది దేవస్థానంలో పనిచేయుచున్న పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించి డి ఎ అరియర్స్ / పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని పలువురు ఆలయ ఉద్యోగులు కోరుతున్నారు. దాదాపు 24 నెలలకు సంబంధించి డి ఎ అరియర్స్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. గత ఏడాది దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు పూర్తయిన తర్వాత బకాయిలు విడుదల చేస్తామని ఆలయ అధికారులు హామీ ఇచ్చారని తెలుస్తుంది. కొన్ని రోజులు అనంతరం కార్తీక మాసం పూర్తయిన తర్వాత నిధులు విడుదల చేస్తామని పాత బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఉద్యోగ బాధ్యతల రీత్యా ఇవన్నీ పూర్తిచేసిన 24 నెలల డి ఏ అరియర్స్ ఆలయ ఉద్యోగులకు చెల్లించకపోవడంలో అంతర్యం ఏమిటని పలువురు ఆలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ రానుందని పండుగనాటికైనా పాత బకాయిలు విడుదల కాకపోతాయా, మా అప్పులు తీరకపోతాయా, పండగపూటైనా నాలుగు పచ్చడి మెతుకులు తినక పోతామా అని ఆలయ సిబ్బంది ఆశగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన  డి ఎ గత ఏడాది నవంబర్ నుంచి పాత బకాయిలతో  పాటు అమలుపరిచి విడుదల చేయాలని పలువురు ఆలయ ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఆలయ ఉన్నత అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై ఆలయ ఉద్యోగుల ఇళ్లలో పండగ వాతావరణం నెలకొనే అంశంపై ఆధారపడి ఉంటుంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *