NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27 నుంచి ‘కులగణన’ ప్రారంభం

1 min read

సీపీఓ టి.హిమ ప్రభాకర్​ రాజ్​

పల్లెవెలుగు:కర్నూలు జిల్లాలో నవంబరు 27 నుంచి కులగణన ప్రారంభమవుతోందని, అందులో భాగంగా  ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు చీఫ్​ ప్రణాళిక అధికారి టి.హిమ ప్రభాకర్​ రాజ్​. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టనున్న కులగణన పై ప్రజలకు అపోహాలు వద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు  ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలలో అందరికీ అందేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  మండలాల్లో ఎంపీడీఓ, తహసీల్దార్లు తమ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని, డిసెంబరు 4వ తేదీలోపు విలేజ్​ సెక్రటరిలు, వార్డు సెక్రటరీలు  కులగణనపై పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కులగణన కార్యక్రమానికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా చీప్​ ప్రణాళిక అధికారి టి.హిమ ప్రభాకర్​ రాజ్​ కోరారు.

About Author