కుంభోత్సవం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహణ
1 min read

గ్రామ ప్రజల సమిష్టి కృషితో వైభవంగా జరిగిన దేవర కార్యక్రమం – టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ సహా నాయకుల హాజరు
హోళగుందన్యూస్ నేడు: పెద్దహ్యాట గ్రామంలో బంగారమ్మ దేవి, కొల్లాపురమ్మ దేవి, సుంకాలమ్మ దేవి కుంభోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించబడింది. అలానే గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఊరి దేవర కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ , మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపపతి , టీడీపీ సీనియర్ నాయకులు యారిస్వామి , దిద్ది నాగప్ప పాల్గొని దేవాలయ కార్యక్రమాలను దర్శించుకున్నారు.అనంతరం దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్ద హ్యాట సంఖ్యలోనే గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామానికి విచ్చేసిన టీడీపీ నాయకులను గ్రామస్తులు హారతులతో ఘనంగా స్వాగతించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, సంప్రదాయాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.

