NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోతులింగేశ్వర స్వామి జాతర రథోత్సవానికి ఈ బీ జి గోవింద్ గౌడ్‌కు ఘన ఆహ్వానం

1 min read

హోళగుందన్యూస్ నేడు; గజ్జహల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే పోతులింగేశ్వర స్వామి జాతర రథోత్సవానికి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈ బీ జి గోవింద్ గౌడ్‌ను గ్రామస్తులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఏప్రిల్ 2, 4, 2026న జరిగే ఈ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా గ్రామ పెద్దలు కలిసి ఆయనను కలుసుకొని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పోతులింగేశ్వర స్వామి జాతర ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడే ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తుందని తెలిపారు. రథోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని, ఈ వేడుక గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని పేర్కొన్నారు.ఈ ఆహ్వాన కార్యక్రమంలో గజ్జహల్లి గ్రామ సర్పంచ్ గిరిమల్ల, పూజారి రామలింగ, శంభు, లింగ దాసర, రాము, బాలప్ప, మలింగ, మహేష్ తదితర గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.జాతర కార్యక్రమం విజయవంతంగా, శాంతియుతంగా జరిగి గ్రామానికి శుభఫలితాలు తీసుకురావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. అలాగే ఈ వేడుకలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు.

About Author