PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌న‌సేన అధినేత‌కు క‌ర్నూల్ ఎమ్మెల్యే స‌వాల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్ స‌వాల్ విసిరారు. రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. ఆయన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు చేస్తున్నారని, నిజంగా ప్రజాబలం ఉంటే కర్నూలులో పోటీ చేయాలన్నారు. గోదావరి జిల్లాల కంటే ఇక్కడ ఘోరంగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ పర్యటనలు చేస్తున్నారు తప్ప ప్రజా మేలు కోసం కాదన్నారు.

                                 

About Author