కుష్టు వ్యాధి రహిత జిల్లాగా కర్నూలును తీర్చిదిద్దాలి
1 min read
ప్రారంభ దశలోనే కుష్టు వ్యాధిని గుర్తించి చికిత్స అందించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు, వైద్య సిబ్బంది, ప్రజలు సమిష్టిగా కృషి చేసి 2027 నాటికి కుష్టు వ్యాధి రహిత జిల్లాగా కర్నూలును తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.ఈ నెల 11 నుండి 24 వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమానికి (LCDC) సంబంధించిన పోస్టర్ ను కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ ఆవిష్కరించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించడం, వ్యాధిపై ఉన్న అపోహలు, భయాలను తొలగించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి చికిత్స అందించడం LCDC కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారజిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో 2 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, పాఠశాల విద్యార్థులు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని విద్యార్థులు, కళాశాల విద్యార్థులకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో LCDC కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించి, ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.వై.కామేశ్వర ప్రసాద్, జిల్లా కుష్టు, ఎయిడ్స్ & టి.బి.అధికారి డాక్టర్.ఎల్.భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.


