28న ‘కురువ’ల కార్తీక వనభోజనం…
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలో కురువల ఐకమత్యం చాటుతూ… కార్తీక వనభోజనం నిర్వహిస్తున్నామన్నారు కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి. ఆదివారం నగరంలోని జయశ్రీ హోటల్లో కురువల సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి అధ్యతన జరిగిన సమావేశంలో ముఖ్య సలహాదారుడు విశ్రాంత తహసీల్దార్ కే .కిష్టన్న, జిల్లా ఉపాధ్యక్షుడు బి .వెంకటేశ్వర్లు, పాలసుంకన్న, జిల్లా కోశాధికారి కే .సి .నాగన్న, కళ్ళే లక్ష్మన్న పాల్గొని ప్రసంగించారు. నగర శివారులోని పెద్దపాడు మోడల్ స్కూల్ పక్కన ఉన్న శ్రీ బీరప్ప స్వామి ఆలయప్రాంగణంలో ఈ నెల 28న ‘కార్తీక వన భోజనం’ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కీ .శే .డా .పుల్లన్న ఆశయ సాధన కోసం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశం లో నగర అధ్యక్ష,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ, జిల్లా నాయకులూ వెంకటకృష్ణ ,బి .సి .తిరుపాల్ ,ఓ .పుల్లన్న ,దివాకర్, పెద్దయ్య, మద్దులేటి , టీచర్ మద్దులేటి, రేమట కిష్టప్ప , నాగయ్య , నాగరాజు, ప్రముఖ గాయకుడు నాగశేషులు, చిరంజీవి ,నారాయణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.