లేబర్ చట్టాలు రద్దు చేయాలి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హోళగుంద కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి తహశీల్దార్ నిజాముద్దీన్ కీ వినతిపత్రం ఈవ్వడం జరిగింది సందర్భంగా రైతు సీఐటీయూ మండల కార్యదర్శిలు వెంకటేష్ నాగరాజు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో 1926 నుండి నేటి వరకు కార్మిక చట్టాలు సాధించుకున్నారని ఈ చట్టాల ద్వారా కార్మికుల ప్రయోజనాలు పొందుతున్నారని తెలిపారు బిజెపి ప్రభుత్వం చట్టాల నుండి 29 చట్టాలు కుదింపు చేసి వాటిని కూడా నాలుగు లేబర్ చట్టాలుగా పార్లమెంట్లో తీర్మానం చేయడం దాన్ని దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక సంఘాలు ముక్తకంఠంగా వ్యతిరేకించాయని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూపాయలు 26000 ఇవ్వాలని అలాగే శ్రామిక మహిళలకు చట్టాలు సౌకర్యాలు కల్పించాలని గ్రాచుటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని తీర్పు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేయడం చాలా దుర్మార్గమని అన్నారు ఢిల్లీ కేంద్రంలో 14 నెలలు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆందోళన చేసినప్పటికీ ఫిరంగిలు పోలీసులు లాటి చార్జీలు ముళ్ళకంపలు కేంద్ర ప్రభుత్వం వీటి ద్వారా బెదిరించిన రైతులు ఉద్యమాలు చేశారని ప్రాణాలర్పించారు అయినప్పటికీ నేటికీ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవ డం దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు గ్రామీణ ఉపాధి పథకము కార్మికులకు చేతినిండా పని లేక చేసిన పనికి వేతనాలు లేక కేంద్ర ప్రభుత్వం సరైన బడ్జెట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్నారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేల రూపాయలు ఇవ్వాలని గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఉపాధి హామీ కార్మికులకు బడ్జెట్ కేటాయించాలని తదితర సమస్యలను దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామాంజనేయులు రైతు సంఘం నాయకులు కిష్టప్ప రవి VRA మౌలలి సోమలింగా హమాలి నాగరాజు. ఈరన్న సిద్దాలింగ గదిలింగ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.