PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యాగంటి క్షేత్రంలో లక్ష దీపోత్సవం..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: యాగంటి లో అఖండ దీపం ఏర్పాటు నిర్మాణ పనులను పరిశీలించిన మన ప్రియతమ నాయకులు,పాణ్యం ఎమ్యెల్యే మరియు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,శ్రీమతి.కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సదా భార్గవి,టీటీడీ అధికారులు.. నంద్యాల జిల్లా,బనగానపల్లె మండలం యాగంటి దేవస్థానం శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీకమాసం సందర్భంగా టీ.టీ..డీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సదా భార్గవి శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ ప్రశాంతి లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టిటిడి వారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నవంబర్ నెల ఏడవ తేదీన రెండవ సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అనంతరం తమిళనాడులోని అరుణాచలంలో అఖండ జ్యోతి ఏ విధంగా ఏర్పాటు చేశారో ఆ విధంగా యాగంటి దేవస్థానం పై కొండ భాగంలో అఖండ జ్యోతి నిర్మాణ పనులను టీటీడీ జేఈవో సదా భార్గవి, టీడీపీ పాలకమండలి సభ్యులు,పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గార్లు ఏర్పాట్లను పరిశీలించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ…ఎర్రమల కొండల్లో సతీసమేతంగా స్వయంభుగా వెలసిన శ్రీ ఉమామహేశ్వరుల యాగంటి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం అని అలాంటి దేవస్థానంలో లక్ష దీపోత్సవ కార్యక్రమంలో టిటిడి వారు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.అలాగే నిత్యం వెలిగే అఖండ జ్యోతిని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని ఈ అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుందని చెప్పారు. ఆ ఉమామహేశ్వర్లు ఏడుకొండలస్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేపడుతున్నటువంటి వికేంద్రీకరణకు మద్దతుగా స్వామివారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండాలని కోరుకోవడం జరిగిందని చెప్పారు.అలాగే రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న టిటిడి కళ్యాణ మండపంలో త్వరలోనే పనులు మొదలు పెడతామని చెప్పారు. అలాగే ఈనెల 7వ తేదీన లక్ష దీపోత్సవ కార్యక్రమానికి టిటిడి దేవస్థానం ఆలయ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు హాజరవడం జరుగుతుందని దానితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు.టిటిడి దేవస్థానం జేఈవో సదా భార్గవి గారు మాట్లాడుతూ టిటిడి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నవంబర్ నెల ఏడవ తేదీన లక్షతిప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందుకు ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని చెప్పారు అలాగే అఖండ జ్యోతి నిర్మాణ పనులను కూడా పరిశీలించడం జరిగిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో యాగంటి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ శ్రీమతి.కాటసాని ఉమామహేశ్వరమ్మ, టీటీడీ అధికారులు వీజీవో మనోహర్, ఈ ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వరరావు, పి ఆర్ ఓ రవి, యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్ దోనపాటి యాగంటి రెడ్డి,మల్కిరెడ్డి దస్తగిరి రెడ్డి లతోపాటు ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

About Author