సంస్కృతంతో మిళితమైన భాష..‘తెలుగు’
1 min read– రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. రాయలసీమ యూనివర్సిటీలోని సెనేట్ హాల్ లో జరిగిన భాష చైతన్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష… సంస్కృతం భాషతో మిళితమైన భాష అన్నారు. సంస్కృతం నుంచే తెలుగు కావ్య భాషగా మారిందన్నారు . శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో ప్రబంధ సాహిత్యం సంస్కృతంతో మిళితమైనందునా సంపన్నమైందన్నారు.
దక్షిణ భారత దేశ భాషలన్నిటిలోనూ సంస్కృత ప్రభావం కనిపిస్తుందని లక్ష్మిపార్వతి అన్నారు. ప్రతి జిల్లాలోని యూనివర్సిటీల్లో భాషా చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు భాషాభివృద్ధికి నూతనంగా అకాడమీని సీఎం జగన్ ఏర్పాటు చేసినట్లు లక్ష్మిపార్వతి తెలిపారు. కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఆనందరావు, రెక్టార్ ప్రొఫెసర్ సంజీవ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మధుసూదన వర్మ, సాహితీవేత్తలు హయగ్రీవాచార్యులు తదితరులు పాల్గొన్నారు.