NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మా అభివృద్ధి చెబితే..మీకు నిజంగానే ఫీవర్

1 min read

డాక్టర్ సుధీర్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ నాయకులు..

నందికొట్కూరు న్యూస్ నేడు: మా ప్రభుత్వ రెండున్నర పాలనలో పట్టణంలో మేము చేస్తున్న అభివృద్ధి గురించి చెబితే మీకు నిజంగానే ఫీవర్ వస్తుందని నందికొట్కూరు పట్టణ టిడిపి నాయకులు వైసీపీ నాయకులపై మండిపడ్డారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ సెక్రటరీ మరియు క్లస్టర్ ఇంచార్జి లాయర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలో ఎన్నెన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయనేది వారు తెలుసుకొని మాట్లాడాలని 21 కోట్లతో సిమెంటు రోడ్లు పార్క్ లకు నిధులు కేటాయించడం జరిగిందని పట్టణంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మీకు కనబడటం లేదా అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. అలగనూరు రిజర్వాయర్ కమిషన్ల కు పాల్పడింది మేము కాదు గతంలో కమిషన్లకు పాల్పడింది మీ నాయకులే కాదా అని అన్నారు.పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చరిత్ర తెలుసుకొని మీరు మాట్లాడాలని మీరు చేసిన పాపాలే మిమ్మల్ని వెంటాడుతున్నాయని అది మీరు గమనించుకోవాలన్నారు. సొసైటీ చైర్మన్ ముర్తు జావలి మాట్లాడుతూ పట్టణం ప్రశాంతంగా ఉండాలనేదే మా నాయకుని లక్ష్యమని ఏది పడితే అది మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని వైసీపీ నాయకులపై మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం డీ జమీల్,వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *