పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఇరు పార్టీల నాయకులు
1 min read– పరిసర ప్రాంతాల్లో నాయకుల కోలాహలం -గ్రామాలు మండల నాయకులంతా అక్కడే
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.ఎన్నికలు ఏవిధంగా జరుగుతున్నాయనే వాటి గురించి ఇరు పార్టీల నాయకులు ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు జరుగుతున్న తీరు గురించి స్థానిక మండల నాయకులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,ఐటి విభాగం జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి తదితర వివిధ గ్రామాల నాయకులు అక్కడే మకాం వేస్తూ ఓటర్లతో మమేకమయ్యారు.అటు నందల పార్లమెంటు ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు టిడిపి అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి,టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,గుండం రమణారెడ్డి,వంగాల శివరామిరెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళి పై మాండ్ర శివానందరెడ్డి నాయకులతో చర్చించారు.