NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన ఎస్ఈ గోదావరి గోపాల్ ను కలిసిన ఇంజనీర్స్అసోసియేషన్ నాయకులు

1 min read

రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:జలవనరుల శాఖ పరిధిలో ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గా గోదావరి గోపాల్ గురువారం ఉదయం ఛార్జ్ తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డాక్టర్:దేవరకొండ వెంకటేశ్వర్లు నూతన ఎస్ఈ ని గౌరవ పూర్వకంగా కలిసి స్వాగత సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నీరు ప్రగతి,ఎస్ఈ వెంకట స్వామి, గౌరవ అధ్యక్షులు సి.హెచ్. దేవ ప్రకాష్,ఉపాధ్యక్షులు డిప్యూటీ ఎస్ఈ ధనుంజయలు,డిఈఈ సీతారాములు సెక్రటరీ డిఈఈ గనిరాజు,పలువురు డిఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ , శ్రీశైలం ప్రాజెక్ట్, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలలో  గత 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న నూతన ఎస్ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉన్న జలవనరులను  సాగునీటికి, త్రాగునీటికి, ప్రజల ఇతర అవసరాలకి సమర్థవంతంగా  వినియోగిస్తామని అన్నారు.ఈ క్రమంలో సర్కిల్ పరిధిలో సేవలందిస్తున్న వివిధ స్థాయిల ఇంజనీర్లందరు సహకరించాలని గోపాల్ కోరారు.

About Author