NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉమ్మడి జిల్లాల కోర్టు ప్రాంగణంలలో రేపే జాతీయ లోక్ అదాలత్”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జాతీయ, రాష్త్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు, కర్నూలు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రజలకు  సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో 2026 జులై, 11 రెండవ శనివారము న కర్నూలు మరియు నంద్యాల జిల్లాలలోని అన్ని న్యాయ స్థానాల్లో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ మరియు ప్రిలిటిగేషన్ కేసులు పరిష్కరించు కోవడానికి జాతీయ లోక్ అదాలత్  నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలియజేశారు. ఈ లోక్ అదాలత్ ను పురష్కరించుకొని కర్నూలు జిల్లా కోర్టు ఆవరణంలో 8 బెంచీలు మిగతా మండలలో 23 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ అవకాశమును కక్షిదారులు అందరూ ఉపయోగించుకొని , తమ తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.

About Author