NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

`రిల‌య‌న్స్` లో నాయ‌క‌త్వ మార్పులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో నాయకత్వ మార్పు ఉంటుందని కంపెనీ ఛైర్మన్‌, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ తొలిసారిగా పేర్కొన్నారు. తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీకి సంబంధించిన వారసత్వ ప్రణాళికలపై ఇప్పటి వరకూ నోరువిప్పని ముకేశ్‌ అంబానీ మొదటిసారిగా ‘ఇకపై నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేస్తామ’ని అనడం విశేషం.

                                        

About Author