PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దిగ్గజ నటుడికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

1 min read


పల్లెవెలుగు వెబ్: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చిక్సిత అందిస్తున్నారు. కైకాల పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఇటీవల ఇంట్లో కాలుజారి కిందపడటంతో అస్వస్థతకు గురైన సత్యనారాయణను సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చిక్సిత అందించారు. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. మరోపక్క సత్యనారాయణ కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

About Author