NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీ ఫార్మా లిమిటెడ్, లీ హెల్త్ డొమైన్ వైద్య సేవలు అభినందనీయం

1 min read

175 మందికి ఉచిత వైద్య సేవలు.

ఆరోగ్యమే మహాభాగ్యం.

ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్దతీసుకోవాలి.

లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ‌ లీలారాణి.

బాడంగి,విశాఖపట్నం.. న్యూస్​ నేడు:  ప్రతి ఇక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని,నాణ్యమైన ఆహారం తీసుకునేందుకు అసక్తి చూపాలని లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి పేర్కోన్నారు.లీ హెల్త్ డొమైన్ లీ ఫార్మసీ వారి సహకారంతో 175 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. స్ధానిక దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో శనివారం మండల వైస్ ఎంపీపీ సింగిరెడ్డి భాస్కర్ రావు మరియు టి. రవిబాబు, లీ ఫార్మసీ ప్రతినిధులు, దీక్ష వారితో కలిసి జ్యోతి  వెలిగించి  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎస్ భాస్కర మాట్లాడుతూ ఉచిత వైద్యశిబిరం కీళ్ల నొప్పులు ఉన్న వ్యక్తులకు చాలా ఉపయోగం అని అన్నారు. టి రవి బాబు మాట్లాడుతూ లీ ఫార్మా వారు మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల పేదలకు చాలా ఉపయోగకరమైన తెలిపారు. కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎల్  సత్యం మాట్లాడుతూ లీ ఫార్మసీ వారు పేదల కొరకు ఇలాంటి కార్యక్రమాలు దీక్ష వారితో  కలిసి నిర్వహించడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలీ హెల్త్ డొమైన్, లీ ఫార్మా లిమిటెడ్ సహకారంతో దీక్ష మహిళా వెల్ఫేర్ సొసైటీ  కార్యాలయంలో శనివారం  ఉచిత మోగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో, ఆంత్రోపోమెట్రిక్ కొలతలు, చేతి పట్టు బలం, శరీర కూర్పు, ఎముకల ఖనిజ సాంద్రత, డాక్టర్ కన్సల్టేషన్ మరియు పోషకాహార నిపుణుల కన్సల్టేషన్ వంటివి నిర్వహించారు. డాక్టర్లు మరియు పోషకాహార నిపుణులు నివేదికలను పరిశీలించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి వైద్య సలహాలు మరియు పోషకాహార మార్గదర్శకాలను అందించారు. ఈ కార్యక్రమంలో  దీక్ష మహిళా వెల్ఫీర్ వెల్ఫేర్ సోసిటీ సిఈఓ శాంతి, లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలా రాణి , క్యాంప్ కోఆర్డినేటర్లు సరోజిని , జయలక్ష్మి, డాక్టర్.రావు బాబు , పోషకాహార నిపుణురాలు మాధురి, జి.ఎన్.ఎం భాగ్యలత మరియు లీ ఫార్మా బృందం ఎంపీటీసీ పాలవలస గౌరు బొత్సవానివలస ఆదినారాయణ కంటి వైద్య నిపుణులు త్రినాధ రావు దీక్ష మహిళ వెల్ఫేర్ సొసైటీ మరియు మండలి సిబ్బంది శ్రీరామ్ మూర్తి వెంకటరావు భీమారావు ఈశ్వర్ రావులతో వివిధ గ్రామాల పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

About Author