NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లి  రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

1 min read

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు. డి రాజా సాహెబ్

పత్తికొండ, న్యూస్​ నేడు:  భారీ వర్షాలు, ధరలు లేక నిండా మునిగిన ఉల్లి రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి  డి. రాజా సాహెబ్, మండల కార్యదర్శి సిద్దు కోరారు.ఎకరాకు లక్ష రూపాయలు వరకు పెట్టుబడి పెట్టి పండించిన ఉల్లికి సరైన గిట్టుబాటు ధర రాక ఉల్లి రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారని తెలిపారు. ఈ మేరకు శనివారం నష్టపోయిన వెళ్లి రైతులను ఆదుకోవాలని స్థానిక ఆర్డిఓ భరత్ నాయక్ కు ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి కే .సిద్దు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి .రాజా సాహెబ్ మాట్లాడుతూ,జిల్లాలో ఈ సంవత్సరం ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగు చేసి తన కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఉల్లి పంట సాగు చేశారని తెలిపారు. జిల్లాలో  ఖరీఫ్జన్లో దాదాపు 57, 700 ఉల్లి సాగు చేశారని అన్నారు. పండిన ఉల్లి పంటను అమ్మకానికి మార్కెట్లోకి  తీసుకొస్తే ఉల్లి ధరలు పూర్తిగా పడిపోయి, కొనుగోలు చేసే వ్యాపారులే లేకపోయారని పేర్కొన్నారు. దీంతో ఎన్ని రైతులు చేసేదేమీ లేక పండిన పంటను మార్కెట్లలో పడబోసి ఇంకొంతమంది రైతులు పొలాల్లోనే దున్నేసి తీవ్రంగా నష్టపోయారని అన్నారు. క్వింటాల్ ఉల్లి పన్నెండు వందల రూపాయలకు ప్రభుత్వమే ఉంటుందని చెప్పి తీరా ప్రభుత్వం కూడా ఉల్లి పంటను కొనకుండా చేతులెత్తేసిందని అన్నారు. క్వింటాలు 1200 రూపాయలు చొప్పున వారం రోజులు మాత్రమే కొనుగోలు చేసి, 7 కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయలేదని పేర్కొన్నారు. నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకుంటామని స్వయానా సీఎం చంద్రబాబు హెక్టారుకు 50,000  రూపాయలు పరిహారంగా చెప్పారు.

About Author