NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లీ ఫార్మా ఉచిత యోగా వైద్య శిబిరానికి విశేష స్పందన

1 min read

ప్రజలు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకాలు కలిగిన ఆహారం పై దృష్టి సారించాలి.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.

ప్రతి‌ ఒక్కరు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

లీ ఫార్మా డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి.

(అచ్యుతాపురం,విశాఖపట్నం), న్యూస్​ నేడు: ప్రజారోగ్యంపై తమ సంస్ధ కృషి‌ చేస్తుందని,పోషక‌ విలువలతో కూడిన అహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపోందించుకోవచ్చని లీ‌ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఆళ్ళ లీలారాణి అన్నారు. రెండు రోజుల పాటు  లీ ఫౌండేషన్  సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)భాగస్వామ్యంతో కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం ప్రజల కోసం ఏపీఐఐసీ  బిల్డింగ్ సమీపంలో,  వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది.ఈ శిబిరం ద్వారా సుమారు 500 మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారు. శిబిరంలో పాల్గొన్న వారికి ఈ క్రింది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు:

​హ్యాండ్ గ్రిప్ స్ట్రెంత్ (చేతి పట్టు బలం),  (బాడీ మాస్ ఇండెక్స్),  (హీమోగ్లోబిన్),  (రాండమ్ బ్లడ్ షుగర్)

​ (రక్తపోటు),  (ఎముక ఖనిజ సాంద్రత), బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ (శరీర విశ్లేషణ)పరీక్షల అనంతరం, వైద్యులు మరియు పోషకాహార నిపుణులు నివేదికలను పరిశీలించి, అవసరమైన ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి మార్పులపై వ్యక్తిగత కౌన్సెలింగ్ అందించారు.పోషకాహార కిట్‌ల పంపిణీ:పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉచిత మందులతో పాటు, ఈ క్రింది వస్తువులతో కూడిన న్యూట్రిషన్ కిట్‌లను పంపిణీ చేశారు:చిరుధాన్యాల పిండి, బెల్లం పౌడర్, న్యూట్రిబార్స్, మిల్లెట్ కుకీస్ మరియు మిల్లెట్ చిప్స్.నొప్పుల ఉపశమనం కోసం ‘స్మూత్‌వాక్’ ఆయింట్‌మెంట్ మరియు రోల్-ఆన్.మల్టీవిటమిన్ టాబ్లెట్లు.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు,లీ‌ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్  ​ ఆళ్ళ‌ లీలా రాణి మాట్లాడుతూ రోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.సరోజిని మరియు జయలక్ష్మి (క్యాంప్ కోఆర్డినేటర్లు)లీ ఫార్మా హెచ్ఆర్  విభాగం: ఉష , నరేష్ , చంటి , తారక్ .డాక్టర్ రాజారామ్ మాధురి మరియు క్రాంతి (పోషకాహార నిపుణులు)భాగ్యలత (జిఎన్ఏం)లీ ఫార్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author