NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా కొల్లాపూరమ్మ, సుంకులమ్మ, కమలమ్మ దేవతల శంభోత్సవం

1 min read

భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగిన మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ ప్రజలు – ముఖ్య అతిథులుగా టిడిపి నాయకులు హాజరు

హోలగుంద న్యూస్ నేడు: హోలగుంద మండలంలోని లింగంపల్లి గ్రామంలో కొల్లాపూరమ్మ దేవి, సుంకులమ్మ దేవి, కమలమ్మ దేవి శంభోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించబడింది. గ్రామ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఊరి దేవర కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఈ పవిత్ర మహోత్సవానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు, హారతులు, సంప్రదాయ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, మహిళలు, యువకులు, పెద్దలు భక్తి భావంతో కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు దేవతల ఆశీస్సులతో గ్రామానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈ బిజి గోవింద్ గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి, టిడిపి సీనియర్ నాయకులు ఎర్రిస్వామి, రెడ్డి నాగప్ప, హాజరయ్యారు. వారు దేవాలయ కార్యక్రమాలను పరిశీలించి, అనంతరం దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యతకు ఇటువంటి సంప్రదాయ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు.గ్రామానికి విచ్చేసిన టిడిపి నాయకులను గ్రామస్తులు హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

About Author