PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నకేశవ స్వామి ఉత్సవాలు అందరం కలిసి విజయవంతం చేద్దాం

1 min read

– టిడిపి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అంగజాల కృష్ణ యాదవ్…
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని దుర్వేసి గ్రామంలో మే నెలలో జరిగే చేన్న కేశవ స్వామి ఉత్సవాలను అందరం కలిసి విజయవంతం చేయాలని టిడిపి నాయకులు అంగజాల కృష్ణ యాదవ్. అంగజాల శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ దుర్వేసి గ్రామంలో జరిగే చెన్నకేశవ స్వామి ఉత్సవాలకు గ్రామంలోని అన్ని కులాల చెందిన వారిని కలుపుకొని వేడుకలను నిర్వహించాలన్నారు. గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి మరియు రెడ్డి వర్గానికి చెందిన కొందరు మరియు వాల్మీకి కుటుంబాలు మరియు తన అనుచరులతో గ్రామంలో జరిగే చెన్నకేశవ ఉత్సవాలను కేవలం కక్ష సాధింపుల కొరకే నిర్వహిస్తున్నారు.రెడ్డి వర్గం. వాల్మీకి చెందిన వారితోనే చందాలు వసూలు చేసి నిర్వహిస్తాం అనడం చాలా దుర్మార్గమని . గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న ఆచరణలను పక్కనపెట్టి నిర్వహించడం సరైనది కాదని అన్నారు. గ్రామంలో80 కుటుంబాల యాదవ సోదరులు ఉన్నారని యాదవ సోదరులను 10 కుటుంబాలను విడదీసి యాదవ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగే ఉత్సవాలకు గతంలో యాదవ్ సంఘం వారు 11 గొర్రెలను బలి కోసం ఇచ్చేవారు. పూర్వకాలం నుంచి ఉన్న యాదవులను పక్కనపెట్టి కొత్తగా గ్రామానికి వచ్చిన యాదవుల దగ్గర నుండి గొర్రె పిల్లలను తీసుకోవడం సరైనది కాదన్నారు. గ్రామంలో జరిగే ఉత్సవాలకు అన్ని కులాలకు చెందిన వారిని పెద్ద మనుషులుగా ఎన్నుకొని నిర్వహిస్తే బాగుంటుందని ఈ సమావేశంలో తెలిపారు. గ్రామంలో పట్టింపులకు పోకుండా అందరిని కలుపుకో పోవాలని దుర్వేసి గ్రామంఫ్యాక్షన్ కావడంతో రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మా గ్రామం ఫ్యాక్షన్ తో 13 మంది దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురిపై దాడి నిర్వహించారు. గత 2003వ సంవత్సరంలో అప్పుటి సర్పంచ్ బాలరాజు మా తమ్ముడైన ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ గ్రామ పెద్దల కోరిక మేరకు గ్రామ పెద్దగా ఉండి చెన్నకేశవ స్వామి ఉత్సవాలను విజయవంతం చేశారని తెలిపారు. మే నెలలో జరిగే చెన్నకేశవ స్వామి ఉత్సవాలకు యాదవ కులంలో రెండు వర్గాలుగా చీల్చి రాజకీయం చేయడం సరైనది కాదని అన్నారు. గ్రామానికి చెందిన అన్ని వర్గాలకులాలకు కలుపుకొని పోయి జాతర విజయవంతం చేయాలని కోరారు.

About Author