PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిస్తాం

1 min read

– జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆధునిక భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే 126వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జాతీయ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు కురుమూర్తి అధ్యక్షతన నందికొట్కూరు పట్టణంలోని రబ్బాని కాంప్లెక్స్ నందు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈమె చేసిన కృషి మహిళ లోకానికే వన్నెతెచ్చిందని తెలిపారు. మహిళలు ఈరోజు విద్యాభ్యసిస్తున్నారంటే కారణం సావిత్రిబాయి పూలేని తెలిపారు సత్యశోధక్ ఎన్నో పుస్తకాలను రచించిన మహాత్మ జ్యోతిరావు పూలే , సావిత్రిబాయి పూలే అని తెలియజేశారు. మనువాదుల బ్రాహ్మణిజం నుంచి విముక్తిని కల్పించినటువంటి గొప్ప విద్యావంతురాలని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా సావిత్రి పూలే విగ్రహాలకు చిత్రపటాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వర్ధంతి నిర్వహించాలని ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ అధికారులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం నాయకులు సిడి. ఆంజనేయులు, వడ్డే రాముడు, ఆర్ఎంపి శ్రీనివాసులు, యుగంధర్ భాష, గోపాలకృష్ణుడు, బాబు , స్వామి నాయుడు, సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

About Author