NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“కౌమార దశలో గర్భధారణను అరికడదాం

1 min read

బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం.”

కౌమార దశలో గర్భధారణ బాలికల ఆరోగ్యం, విద్య మరియు భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు: కౌమార దశలో గర్భధారణను అరికడదాం – బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో కౌమార దశలో గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో  రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు మరియు అవగాహన లోపం కారణంగా తక్కువ వయసులోనే గర్భం దాల్చడం వల్ల బాలికల ఆరోగ్యం, విద్య మరియు భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరమని కలెక్టర్ పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. బాల్య వివాహాలను అరికట్టడం మరియు టీనేజ్ గర్భధారణ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. లైంగిక అవగాహన లోపం, బాల్య వివాహాలు, పేదరికం, సరైన తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయ, డి ఎమ్ హెచ్ ఓ డా.కామేశ్వర రావు, ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఉమ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కో ఆర్డినేటర్ డా.భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *