NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సబ్ ఇన్ స్పెక్టర్ పదోన్నతికి కొనసాగుతున్న ఎంపిక పరీక్షలు

1 min read

జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో  పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన…

ఐజీ / అనంతపురం రేంజ్ ఇంచార్జి డీఐజీ  డాక్టర్ షెముషి  ఐపిఎస్

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

కర్నూలు  ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు మండలం, దిన్నదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో కొనసాగుతున్న సబ్ ఇన్ స్పెక్టర్ పదోన్నతి ఎంపిక పరీక్షలను బుధవారం  ఐజీ / అనంతపురం  రేంజ్ ఇంచార్జి డీఐజీ  డాక్టర్ షెముషి  ఐపిఎస్ , కర్నూలు ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపియస్ , కర్నూలు  ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపియస్ లు పరిశీలించారు. రాయలసీమ జోన్  పరిధిలోని ఎఎస్సైలు  మొత్తం 72 మంది ఈ  ఎస్సై పదోన్నతి కి బుధవారం  ఔట్ డోర్ పరీక్షలు  నిర్వహించారు.డ్రిల్లు, ఆయుధాల పై పరిజ్ఞానం , నేర స్ధల పరిశీలన, మౌఖిక పరీక్ష(ఓరల్ టెస్ట్) తదితర  అంశాలపై పరీక్షలు  నిర్వహించారు.  మంగళ వారం ఇండోర్ పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల నిర్వహణకు డిటిసి ప్రిన్సిపల్ శ్రీ హుస్సేన్ పీరా ,  డిటిసి వైస్ ప్రిన్సిపల్ శ్రీ దుర్గాప్రసాద్  భద్రత , నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు. ఆయా పరీక్షలలో ప్రతిభ కనబరచిన వారికి  సబ్ ఇన్ స్పెక్టర్ లుగా  పదోన్నతులు కల్పిస్తారు. ఈ పరీక్షల నిర్వహణ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్  / డిటిసి  ప్రిన్సిపాల్  శ్రీ హుస్సేన్ పీరా  , కర్నూలు  డిటిసి డిఎస్పీ /  వైస్ ప్రిన్సిపాల్  దుర్గప్రసాద్ , డిఎస్పీ లు శ్రీనివాసులు, కరీం , సూర్యనారాయణ రెడ్డి, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్  డాక్టర్ స్రవంతి , నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నందిని, కర్నూలు రేంజ్  డిఐజి  మేనేజర్  రత్నప్రకాష్,  సిఐలు  , ఎస్సై లు ,  డిఐజి ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *