విద్యుత్ పొదుపు చేద్దాం.. భావితరాలకు వెలుగునిద్దాం..!
1 min read— ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి: విద్యుత్ విలువైనదని రేపటి వెలుగుల సాకారానికి నేడు పొదుపుగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖ రాయచోటి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు..రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చాలా విలువైనదని దానిని పొదుపుగా ఉపయోగించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తక్కువ వాట్ లు గల గృహోపకరణాలను ఉపయోగించాలని, అనవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, కిటికీలు వెంటిలేటర్లు ఉపయోగించి విద్యుత్తును పొదుపు చేయాలని ఆయన సూచించారు. డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు పెయింటింగ్, వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, వైసిపి నాయకులు ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ చంద్రయ్య, ఎంపీటీసీ వీరభద్రయ్య, విద్యుత్ ఇంజనీర్లు శివ ప్రసాద్, రాజేష్, వీరయ్య, జయ ప్రకాష్ఉపాధ్యాయులు ,విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.