PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైకోను ఇంటికి పంపుదాం…

1 min read

– రానున్న ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు.. గౌరు చరిత రెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  సైకో జగన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపుదామని గౌరు వెంకట్ రెడ్డి.గౌరు చరిత రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంచాల కట్ట లో సోమవారం నాడు బాబు తో నేను. రచ్చ బండ .బాబు ష్యురిటీ- భవిష్యత్తుకు గ్వారెంటి . కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా రాష్ట్రం లో  వైసిపి దుర్మార్గపు పాలన. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరించేందుకు ప్రజల్లోకి వెళ్లారు .రానున్న ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరించారు. తెదేపాను బలహీనపరిచేందుకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న కుట్రని ప్రజలకు వివరించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెదేపా విజయం ఆగదని  మీడియాతో అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా తెదేపాను బలహీనం చేయాలన్న వైకాపా ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.టిడిపి అధికారంలోకి వస్తే మహిళలకు పెద్దపీట వేస్తూ ఆరు పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని తల్లికి వందనం. ఆడబిడ్డ నిధి. మహా శక్తి దీపం పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు . మహిళలకు ఉచిత బస్సు  ప్రయాణం కల్పిస్తామన్నారు. అన్నదాత పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 20.000 ఇస్తామన్నారు. బీసీలకు  ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. ఇంటింటికి మంచినీటి  రక్షిత పథకాన్ని తీసుకొస్తామన్నారు ప్రతి వర్గానికి గతంలో టిడిపి ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామన్నారు . అన్న క్యాంటీన్. చంద్రన్న తోఫా. రంజాన్ తోఫాలను. ఆడబిడ్డల పెళ్ళిళ్లకు ఎటువంటి నియమాలు లేకుండా పెళ్ళికానుక ఆర్థిక సాయం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి.మురళి రెడ్డి.   మండల టిడిపి అధ్యక్షుడు సత్యం రెడ్డి . పంటరామచంద్రరెడ్డి. దుర్వేసి కృష్ణ.యాదవ్. అనసూయమ్మ.శ్రీనివాసులు. ఏస్ ఏ ఫరూక్. షేక్ వలి. సీతరామీరెడ్డి.సుభద్రమ్మ.గంగాధర్ రెడ్డి. వడ్డు లక్ష్మి దేవి.రాజు నాయక్.హర్ష వర్ధన్. ఏస్ ఏ ఖలీద్ బాషా. తదితరులు పాల్గొన్నారు.

About Author