NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మట్టి వినాయకులనే  పూజిద్దాం..

1 min read

– ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వినాయక చవితి పండగ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో ఆవుల సంఘం  ఆధ్వర్యంలో 17 వ తేదీ ఆదివారం ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను  నిర్వాహకులు చలపతి రావు,  భీమి శెట్టి మురళి, రంగస్వామి, సగినేల అచ్చన్న, గ్రంధి కృష్ణ మూర్తి  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయకులను ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించారు.ఈ ఏడాది దాదాపు 1300 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసేందుకు విగ్రహాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఆసక్తి కలిగించే విధంగా పర్యావరణ పరిరక్షణకు మేము సైతం కట్టుబడి ఉంటామని ఈసారి అందరూ మట్టి వినాయకుల్ని ప్రతిష్టించెందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో ఇప్పటికే వాతావరణ కాలుష్య విష కోరల్లో చిక్కుకుపోయి  అనేక రోగాల బారిన పడి సతమతమవుతున్నామన్నారు. ఇకనుండి అయినా వాతావరణ కాలుష్య నివారణకు సమాజంలో మార్పుకు నాంది పలకవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మట్టి వినాయకులతో పర్యావరణానికి  కాలుష్యాన్ని నివారించడానికి మంచి మార్గం ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి అవగాహన కల్పిస్తేనే ఆచరణ సాధ్యం అవుతుందని తెలిపారు. ఏట వినాయక చవితి పండగ వస్తుందంటే ఎంత భారీ విగ్రహాలు ఏర్పాటు చేద్దామని ఆలోచన కానీ దానివల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి మనుషులకు జీవ జలానికి హాని కలగజేస్తుంది. రసాయనాలతో తయారు చేసే గణపతి విగ్రహాల వల్ల నీటి కాలుష్యంతో అనేక వ్యాధులు వస్తాయి, అందుకే గణపతి విగ్రహాన్ని మట్టితోనే చేయాలి. మట్టి వినాయకుని పూజించాలి. మట్టి వినాయకుని పూజించడం అంటే మన పకృతిని పూజించడంతో సమానం వినాయక చవితి పండగ అంటే పకృతితో ముడిపడి ఉంటుంది. చెయ్యి చెయ్యి కలుపుదాం మట్టి వినాయకుని పూజిద్దాం అనే నినాదంతో  ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

About Author